News February 27, 2025
అఫ్గాన్ విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా, చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ENG 317కు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.
Similar News
News February 27, 2025
BREAKING: అస్సాంలో భూకంపం

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది.
News February 27, 2025
అనుకోకుండా గెలవలేదు.. అలవాటు చేసుకున్నారు: సచిన్

CTలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన అఫ్గాన్ టీమ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారు అనుకోకుండా గెలిచారని ఇకపై ఎవరూ భావించొద్దన్నారు. అఫ్గాన్ కుర్రాళ్లు గెలుపులను అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన జద్రాన్, 5 వికెట్లు తీసిన ఒమర్‌జాయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.
News February 27, 2025
అఫ్గాన్ చేతిలో ఓటమి.. కెప్టెన్సీపై బట్లర్ కీలక వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.