News February 27, 2025

BREAKING: అస్సాంలో భూకంపం

image

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది.

Similar News

News February 27, 2025

ఘోరం: ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం

image

పుణేలో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో యువతి(26)పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సతారా జిల్లా ఫల్తాన్‌కు చెందిన యువతి పుణేలోని ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. ఊరికి వెళ్లేందుకు స్వర్గేట్ బస్టాండ్‌కు వచ్చింది. బస్సు పక్కన నిలిపి ఉందని ఆమెను తీసుకెళ్లిన నిందితుడు రేప్‌ చేశాడు.

News February 27, 2025

Stock Markets: బ్యాంకు, మెటల్ షేర్ల జోరు

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంటు నెగటివ్‌గా ఉండటమే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,559 (+11), సెన్సెక్స్ 74,639 (+40) వద్ద కొనసాగుతున్నాయి. INDIA VIX 13.37కు దిగిరావడం అనిశ్చితి తగ్గడాన్ని సూచిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.

News February 27, 2025

అమానుషం.. పిల్లాడు హోంవర్క్ చేయలేదని..

image

AP: హోంవర్క్ చేయలేదని ఒంగోలు బాలాజీరావుపేటలో 3వ తరగతి బాలుడు దేవాష్‌కు ట్యూషన్ టీచర్ వాతలు పెట్టారు. అవి పుండ్లుగా మారి చిన్నారి అవస్థ పడుతున్నాడు. దీంతో SNపాడు(M)లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసే బాలుడి తల్లి గౌతమి టీచర్ సాబిరాకు ఫోన్ చేసి ఘటనపై అడగ్గా వాగ్వాదం జరిగింది. ఆపై టీచర్ భర్త తనకు కాల్ చేసి బెదిరించినట్లు గౌతమి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాష్ తండ్రి విశాఖలో జాబ్ చేస్తుంటారు.

error: Content is protected !!