News February 27, 2025
మహారాష్ట్రలో గోధుమపిండితో బట్టతల!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతల వచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావ్ బవాస్కర్ రీసెర్చ్ చేసి, రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమపిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన పిండి బుల్ధానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సిలీనియం అధికంగా ఉంటుంది.
Similar News
News February 27, 2025
భారత్‌కు చెప్పే స్థాయి పాక్‌కు లేదు: క్షితిజ్ త్యాగి

ఇండియాకు నీతులు చెప్పే స్థాయిలో పాక్ లేదని భారత్ రాయబారి క్షితిజ్ త్యాగి తేల్చిచెప్పారు జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐరాస మానవహక్కుల మండలిలో పాక్ మంత్రి అజం నజీర్ తరార్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. మైనారిటీలను చిత్రహింసలు పెడుతూ, తరచుగా మానవహక్కుల ఉల్లంఘన చేసే దేశానికి భారత్‌కు చెప్పే స్థాయి లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాక్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని నొక్కిచెప్పారు.
News February 27, 2025
ఉద్యోగులకు EPFO వడ్డీరేటు తగ్గింపు షాక్?

FY25కి గాను EPFO వడ్డీరేటును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. FRI జరిగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగులో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం 8.25% ఉన్న వడ్డీరేటును 8కి తగ్గిస్తారని అంచనా. స్టాక్‌మార్కెట్లు డౌన్‌ట్రెండులో ఉండటం, బాండ్‌యీల్డులు తగ్గడం మరోవైపు సెటిల్మెంట్లు పెరగడమే ఇందుకు కారణాలు. ట్రస్టీస్ నిర్ణయం 30 కోట్ల చందాదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది.
News February 27, 2025
మహాకుంభమేళా ముగిసినా కొనసాగుతున్న రద్దీ

మహాకుంభమేళా ముగిసినా ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లారు. దీంతో సంగమం ప్రాంతంలోని పలు సెక్టార్లలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్నటితో కుంభమేళా ముగియగా, 45 రోజుల్లో 66.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.