News February 27, 2025
శ్రీశైలంలో నేడు రథోత్సవం, తెప్పోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీశైలంలో రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30గంటలకు రథాంగదేవతా పూజ, రథాంగదేవతా హోమం, రథాంగ దేవతా బలిసమర్పణ, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు సాయంకాలార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంకాల హోమాలు, రాత్రి 8 గంటలకుతెప్పోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Similar News
News February 27, 2025
పిల్లల్ని ఐసిస్‌లో చేర్చుతారా అంటున్నారు: ప్రియమణి

ముస్తాఫారాజ్ అనే వ్యక్తితో తన వివాహం జరిగినప్పుడు తనపై లవ్‌జిహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టబోయే పిల్లలని ఐసిస్‌లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందన్నారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10లో 9నెగటివ్ కామెంట్లే ఉంటాయన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు. కాగా 2017లో ప్రియమణి, ముస్తాఫా మతాంతర వివాహం చేసుకున్నారు.
News February 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

పెద్దపల్లి జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 20.88% నమోదయింది. మహిళలు 2501, పురుషులు 3982, మొత్తం 6483 మంది ఓటు వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 47.25% నమోదైంది. మహిళలు 212, పురుషులు313, మొత్తం 525 మంది ఓటు వేశారు.
News February 27, 2025
ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇదే!

పార్క్ అనగానే పచ్చని చెట్లు, సేదతీరేందుకు కుర్చీలు, వాకింగ్ ట్రాక్‌లు గుర్తొస్తాయి. అయితే, కేవలం 50CMS మాత్రమే ఉన్న అతిచిన్న పార్కు గురించి మీరెప్పుడైనా విన్నారా? జపాన్ షిజుయోకాలోని నాగిజుమి టౌన్లో 0.24 చదరపు మీటర్లలో A3 పేపర్ షీట్లా ఈ ఉద్యానవనం ఉంటుంది. దీనిని 1988లో నిర్మించగా 2024లో సిటీ పార్కుగా మారింది. ఇది ప్రపంచంలోనే అతిచిన్న పార్క్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.