News February 27, 2025
సిరిసిల్ల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో పట్టభద్రులు 22,397, ఉఫాధ్యాయులు 950 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయుల స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News February 27, 2025
చిరుత కళేబరానికి పోస్టుమార్టం పూర్తి

శ్రీశైలం క్షేత్ర పరిధి రుద్రపార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం మృతి చెందిన చిరుత కళేబరానికి గురువారం వైల్డ్ లైఫ్ డాక్టర్లు అరుణ్ వెస్లీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తొలుత అనుమానాస్పద స్థితిలో చిరుత మరణించినట్లు అటవీ అధికారులు భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టులో మానవ ప్రమేయం లేనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తదుపరి పలు నమూనాలను లేబరేటరీకి పంపించినట్లు అటవీ అధికారులు తెలిపారు.
News February 27, 2025
జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.
News February 27, 2025
పోసానిపై థర్డ్ డిగ్రీ: కొరముట్ల

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోసానిని గురువారం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోసానిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అనుమతించకపోవడంతో పోసానిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. విచారణ అనంతరం మాట్లాడిస్తామని పోలీసులు తెలిపారు.