News February 27, 2025
Stock Markets: బ్యాంకు, మెటల్ షేర్ల జోరు

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంటు నెగటివ్‌గా ఉండటమే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,559 (+11), సెన్సెక్స్ 74,639 (+40) వద్ద కొనసాగుతున్నాయి. INDIA VIX 13.37కు దిగిరావడం అనిశ్చితి తగ్గడాన్ని సూచిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.
Similar News
News February 27, 2025
సత్యవర్ధన్‌కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.
News February 27, 2025
కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
News February 27, 2025
CT: గెలుపు రుచి ఎరుగని పాకిస్థాన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం కూడా లేకుండా తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ఘోర ఓటమిపాలై, బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. పాక్ తలరాతను చూసి ఆ దేశ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కప్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదంటూ వాపోతున్నారు.