News February 27, 2025

HYD: శివయ్యా.. కడుపు నింపావయ్యా..!

image

నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.

Similar News

News February 27, 2025

పార్వతీపురం జిల్లాలో 93.94% పోలింగ్ నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 4 గంటల వరకు 93.94% పోలింగ్ శాతం నమోదైంది. ఈ మెరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 2187 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News February 27, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

image

మార్చి 1న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైయుజన్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.

News February 27, 2025

గ్రూప్-2 మెయిన్స్: అభ్యంతరాల గడువు పొడిగింపు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు, కీపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువును APPSC రేపటి వరకు పొడిగించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని, పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా పంపితే పరిగణించబోమని స్పష్టం చేసింది. అనేక వివాదాలు, ఆందోళనల నడుమ ఈ నెల 23న జరిగిన పరీక్షకు 79,599 మంది హాజరైన విషయం తెలిసిందే. అదే రోజు ప్రాథమిక కీని కమిషన్ విడుదల చేసింది.
వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

error: Content is protected !!