News February 27, 2025
పాల్వంచ డ్రోన్ సర్వేను ప్రారంభించిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో గల పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 లో భాగంగా డ్రోన్ సర్వేను పుర అధికారులతో కేంద్ర బృందం సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఈ డ్రోన్ సర్వేను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించి, పలు సూచనలు చేశారు. ఈ సర్వేలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2025
షాకింగ్.. కొడుకుకు 18 ఏళ్లు నిండొద్దని చంపేసింది

USలో మిచిగాన్‌లో దారుణ ఘటన జరిగింది. కేటీ లీ అనే మహిళ కొడుకు ఆస్టిన్(17)ను బర్త్ డే రోజునే చంపేసింది. తనకు 18 ఏళ్లు నిండొద్దని ఆస్టిన్ కోరుకున్నాడని, ఆ మేరకు తల్లి చంపేసిందని కోర్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. అయితే తామిద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక గొంతు కోసినట్లు ఆమె తొలుత 911కు కాల్ చేసి చెప్పడం గమనార్హం. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం.
News February 27, 2025
మంచిర్యాల జిల్లాలో 60.48 శాతం పోలింగ్

మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే సరికి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి మొత్తం 30,921 ఓట్లకు గాను 18,701 ఓట్లు పోలవగా 60.48 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే ఉపాద్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలో మొత్తం 1664 ఓట్లకు గాను 1474 ఓట్లు పోలవగా 88..58 శాతం పోలింగ్ నమోదైంది.
News February 27, 2025
Perplexity AIతో పేటీఎం జట్టు

తమ యాప్‌లో AI పవర్డ్ సెర్చ్ ఆప్షన్ అందించేందుకు Perplexityతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని Paytm CEO విజయ్ శేఖర్ అన్నారు. యూజర్లు ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు, స్థానిక భాషల్లో రోజువారీ ప్రశ్నలు అడిగేందుకు దీంతో వీలవుతుందన్నారు. ‘నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రజలు సమాచారం పొందుతున్న తీరును AI మార్చేసింద’ని ఆయన తెలిపారు. Perplexityని స్థాపించింది IITM గ్రాడ్యుయేట్ అరవింద్ శ్రీనివాస్ కావడం విశేషం.