News February 27, 2025
భువనగిరి: ఒకే కాన్పులో రెండు లేగదూడలు

ఆవు ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన భువనగిరి మున్సిపాలిటి రాయగిరిలో తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన కొత్త కృష్ణ అనే రైతుకు చెందిన పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన ఘటన జరగడం విశేషమని రైతు తెలిపారు. ప్రసవించిన లేగ దూడలను చూడడానికి స్థానికులు రైతు ఇంటికి తరలివెళ్లారు.
Similar News
News February 27, 2025
హ్యాట్సాఫ్.. విశాఖ పోలీస్..!

మహా శివరాత్రి సందర్భంగా గురువారం విశాఖలో భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశాఖ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆరుగురిని గజ ఈతగాళ్ల సాయంతో రక్షించారు. జనసంద్రంలో తప్పిపోయిన 10 మంది చిన్నారులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
News February 27, 2025
సీఎం చంద్రబాబును కలిసిన పీటీ ఉష

AP: సీఎం చంద్రబాబును భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష కలిశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణకు సంబంధించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
News February 27, 2025
US: ప్రాణాపాయ స్థితిలో కూతురు.. తండ్రికి వీసా తిరస్కరణ

మహారాష్ట్రకు చెందిన నీలమ్ షిండే అనే యువతి USలో హిట్ అండ్ రన్‌లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. కూతురి కోసం అక్కడికెళ్లడానికి తండ్రి ప్రయత్నించగా ముంబై వీసా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాము వీసా ఆఫీస్‌కు వెళితే సమస్య వినడానికి కూడా సిబ్బంది ఆసక్తి చూపలేదని వాపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జైశంకర్ చొరవచూపాలని కోరుతున్నారు.