News February 27, 2025
మంచిర్యాల జిల్లాలో 60.48 శాతం పోలింగ్

మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే సరికి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి మొత్తం 30,921 ఓట్లకు గాను 18,701 ఓట్లు పోలవగా 60.48 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే ఉపాద్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలో మొత్తం 1664 ఓట్లకు గాను 1474 ఓట్లు పోలవగా 88..58 శాతం పోలింగ్ నమోదైంది.
Similar News
News February 28, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు > పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో రథోత్సవం > సాగునీటి కోసం కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా > మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ > కాంగ్రెస్ వస్తే కష్టాలు కామన్ ఎర్రబెల్లి దయాకర్ రావు > జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు > జిల్లా వ్యాప్తంగా 94.39% పోలింగ్ నమోదు
News February 28, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు* బ్యాలెట్ పేపర్ల స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ✷ ద్వారకాతిరుమల హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు ✷ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ✷పట్టిసీమ వీరేశ్వరునికి రూ.42 లక్షల రికార్డు స్థాయి ఆదాయం * టీ. నర్సాపురం, ఉంగుటూరులో రథోత్సవాలు * 3,14,984 మంది ఓటర్లకు గాను 2,18,902 మంది ఓటు వినియోగం
News February 28, 2025
చిన్నారిని చిదిమేసిన మానవమృగం.. ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు

ఓ మానవమృగం కామవాంఛకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు వేశామని డాక్టర్లు చెప్పడం ఆ 17 ఏళ్ల నిందితుడి రాక్షసత్వానికి నిదర్శనం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. నిందితుడు పీకలదాకా తాగి బాలిక తలను గోడకు పలుమార్లు కొట్టాడని, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, జువైనల్కు తరలిస్తామని చెప్పారు.