News August 5, 2025
HYDలో వరదముప్పుపై అధికారులు ALERT

మహానగరంలో ఈ రోజు కూడా వర్షం పడే అవకాశాలుండటంతో గ్రేటర్, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నగరంలో ఎక్కడైనా వరదముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. 9000113667 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News August 7, 2025
OU: ఎంఫార్మసీ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News August 6, 2025
ధూల్‌పేటలో కుస్తీ పోటీలు

లోవర్ ధూల్‌పేట్ మినీ స్టేడియంలో ఆగస్టు 9 నుంచి 12 వరకు శ్రీ లాలా పెహిల్వాన్–శ్రీ బాలాజీ పెహిల్వాన్ మెమోరియల్ రెస్లింగ్ టోర్నమెంట్ 2025-26 నిర్వహిస్తున్నారు. 17 వేర్వేరు వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. లెజెండరీ కుస్తీ ఆటగాళ్ల వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ పోటీలు ప్రతియేటా కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయి టాప్ కుస్తీ వీరులు ఈ రింగులో పాల్గొంటారు. ప్రవేశం ఉచితం.
News August 6, 2025
HYD: భారం నీదే వి‘నాయక’!

‘ఇంకా 20 రోజులే ఉంది.. ఏం చేద్దాం బ్రో?’ అని బస్తీలో చర్చ మొదలైంది. సిటీలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా! ఆ మాత్రం హడావిడి ఉంటది. ఈసారి వినాయకచవితికి హైదరాబాదీ ఆరాటం అంతా ఇంతా కాదు. ‘ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరుతుండు. బాలాపూర్ విగ్రహం, మండపం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇక గల్లీలో మనం తగ్గొద్దు. కర్రపూజకు నాయకులను పిలుద్దాం. ఖర్చు ఎంతైనా వి‘నాయకుడి’ మీదే భారం అంటూ యువత నవరాత్రులకు సిద్ధమవుతోంది.