News August 6, 2025
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం (2,258 రోజులు) కేంద్ర హోంమంత్రిగా పని చేసిన నేతగా నిలిచారు. 2019 మే 20న పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయన అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎల్.కె. అద్వానీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. వాజ్‌పేయి హయాంలో అద్వానీ 2,256 రోజులపాటు హోమ్ మినిస్టర్‌గా పనిచేశారు.
Similar News
News August 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 7, 2025
శుభ సమయం (07-08-2025) గురువారం

✒ తిథి: శుక్ల త్రయోదశి మ.1.27 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాఢ మ.2.06 వరకు
✒ శుభ సమయం: ఉ.11.26-మ.12.02
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: రా.10.26-రా.12.05
✒ అమృత ఘడియలు: ఉ.9.00-ఉ.10.40
News August 7, 2025
HEADLINES

* భారత్‌పై మరో 25శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్
* ట్రంప్ సుంకాలు అన్యాయం, అసమంజసమన్న భారత్
* ట్రంప్ టారిఫ్స్ మోదీ వైఫల్యమని కాంగ్రెస్ విమర్శ
* ఈనెల 31న చైనాకు ప్రధాని మోదీ
* సెలూన్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: ఏపీ క్యాబినెట్
* లిక్కర్ కేసులో దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు: CM చంద్రబాబు
* రాహుల్‌ను PMని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం: CM రేవంత్ రెడ్డి