News August 11, 2025
పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తేయాలన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 80శాతం ఎక్స్‌టర్నల్, 20శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ GO జారీ చేసింది. కాగా ఈసారి నుంచి ఇంటర్నల్స్ ఎత్తివేసి 100 మార్కులకు ప్రశ్నపత్రం రూపొందించాలని ప్రభుత్వం భావించింది. సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Similar News
News August 12, 2025
చెప్పే కథ ఒకటి.. తీసేది ఇంకొకటి: అనుపమ

తాము ఓకే చేసిన స్క్రిప్టు మూవీ పూర్తయ్యేలోగా మారిపోతూ ఉంటుందని హీరోయిన్ అనుపమ పేర్కొన్నారు. ‘పరదా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తెలియక ప్రేక్షకులు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం గురించే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
News August 12, 2025
టెంపో ప్రమాదంలో.. 10కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర పుణే జిల్లా మహాలుంగేలో <<17371241>>టెంపో<<>> లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 40 మంది ఉన్నారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
News August 12, 2025
ఆగస్టు 12: చరిత్రలో ఈ రోజు

1919: అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్(ఫొటోలో) జననం
1939: నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా జననం
1972: భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే జననం
1892: గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జననం
1995: హీరోయిన్ సారా అలీఖాన్ జననం
1997: హీరోయిన్ సయేశా సైగల్ జననం
*ప్రపంచ ఏనుగుల దినోత్సవం