News October 5, 2025

నేడు దేవరగట్టులో గురవయ్యల ఆటలు

image

దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బన్నీ ఉత్సవాల అనంతరం ఆదివారం గురువయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడలు వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు హాజరవతున్నారు. సాయంత్రం వసంతోత్సవం, పల్లకి కంకణ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Similar News

News March 12, 2026

కడప: నేటి ఇంటర్ 1st ఇయర్ పరీక్షలకు 92% విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో గురువారం 59 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ కామర్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 92% విద్యార్థులు హాజరయ్యారు. 3,226 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,956 మంది హాజరయ్యారు. 270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. నేటి పరీక్షలకు ఒకేషనల్ విద్యార్థులు లేరు. నేటి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ మీడియట్ అధికారులు తెలిపారు.

News March 12, 2026

సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

image

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.

News March 12, 2026

మణుగూరు: బ్రెయిన్ ట్యూమర్‌తో బీటెక్ విద్యార్థిని మృతి

image

మణుగూరు పట్టణంలోని చాకలి ఐలమ్మ నగర్‌కు చెందిన రాపర్తి అనూష అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. ఇటీవల టైఫాయిడ్ జ్వరం రావడంతో వ్యాధి మెదడుకు వ్యాపించి పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.