News October 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 51

1. బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టిన వానరుడు ఎవరు?
2. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి?
3. కృష్ణుడి భార్య అయిన రుక్మిణికి తండ్రి ఎవరు?
4. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని నుదుటి నుంచి జన్మించిన వీరుడు ఎవరు?
5. గరుత్మంతుడి తల్లి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News November 2, 2025
తాజా తాజా

➤ హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో వాకర్స్‌తో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
➤ HYD కేబీఆర్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్
➤ SRSP 16 గేట్లు ఎత్తి 47,059 క్యూసెక్కులు.. నిజాంసాగర్ 5 గేట్లు ఎత్తి 33,190 క్యూసెక్కుల నీరు విడుదల
➤ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NBK111’ హీరోయిన్‌ను రేపు 12.01pmకు రివీల్ చేయనున్న మేకర్స్.
News November 2, 2025
ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇవి రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా., స్త్రీలకు 25 గ్రా., 2-5 ఏళ్ల పిల్లలకు 15 గ్రా., 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా. ఫైబర్ అవసరం అవుతుంది.
News November 2, 2025
ఫైబర్ వేటిలో ఎక్కువగా ఉంటుందంటే..

ఫైబర్ ఎక్కువగా ఓట్స్, బార్లీ, యాపిల్ , సిట్రస్ పండ్లు, అరటి, పియర్స్, బెర్రీస్, క్యారెట్లు, మొలకలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, బ్రౌన్ రైస్, క్వినోవా, మొక్కజొన్న, బాదం, వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు, కాలిఫ్లవర్, క్యాబేజీ, పచ్చి బటానీ, కొత్తిమీర, పాలకూర, పుదీనా, తోటకూర, జామ, నల్ల శనగల్లో లభిస్తుంది. కనుక వీటిని రోజూ తింటుంటే ఫైబర్‌ను పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.


