News October 30, 2025
కేయూ: ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

భారీ వర్షాల ప్రభావంతో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన న్యాయశాస్త్ర విభాగం సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ అసీం ఇక్బాల్ తెలిపారు. మూడు, ఐదు సంవత్సరాల ఎల్ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షలు, బీటెక్ మొదటి ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 2, 2025
పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు.. నివారణ

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.
News November 2, 2025
వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో కార్తీకమాసం ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.
News November 2, 2025
రేపు వరంగల్ మార్కెట్ ఓపెన్

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. గురువారం, శుక్రవారం మొంథా తుఫాన్ కారణంగా ప్రత్యేక సెలవులు రాగా శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.


