News October 30, 2025
మంచిర్యాల: పలు రైళ్ల రద్దు

మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్డు స్టేషన్ల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజీపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
నూజివీడు రెవిన్యూ డివిజన్.. అటా..ఇటా..?

జిల్లాల విభజనతో ఏలూరు జిల్లాలో చేరిన నూజివీడు రెవిన్యూ డివిజన్‌లో మార్పులు జరిగే అవకాశముంది. ఎన్నికల వేళ చంద్రబాబు నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. నూజివీడు ప్రాంతం విజయవాడను ఆనుకుని ఉందని, తమ ప్రాంతాన్ని ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నూజివీడును కృష్ణా లేదా ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News November 2, 2025
కల్వకుర్తిలో పెరిగిన ఉష్ణోగ్రతలు

గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. అత్యధికంగా కల్వకుర్తిలో 32.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్టూర్లో 32.4 డీగ్రీలు, తోటపల్లి, ఎల్లికల్, ఉర్కొండలో 32.3 డిగ్రీలు, వెల్దండలో 32.4 డిగ్రీలు, అచ్చంపేటలో 31.6 డిగ్రీలు, పెద్దూర్లో 31.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షపాతం నమోదు కాలేదు.
News November 2, 2025
విజయవాడ: ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫోర్‌వీలర్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా స్కిల్ అధికారి ఎస్. శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 8వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులెవరైనా ఈ నెల 9లోపు పాలిటెక్నిక్ కాలేజీలో రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాలని, శిక్షణ పూర్తైన అనంతరం ఉద్యోగాలు కల్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.


