News October 30, 2025

వర్షాలు – మినుము, పెసర పూత నుంచి కాయ దశలో ఉంటే

image

భారీ వర్షాల వల్ల మినుము/పెసర పంటలు పూత నుంచి కాయ దశలో ఉంటే వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంది. ఇవి రాకుండా హెక్సాకొనజోల్ 5 ఎస్.సి 2.0ml లేదా ప్రొపికొనజోల్ 25 ఈ.సి 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మారుకా మచ్చల పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 20 ఈ.సి 2.5ml లేదా నొవాల్యురాన్ 10 E.C 1ml ఏదో ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.

Similar News

News November 12, 2025

శీతాకాలంలో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే జరిగేది ఇదే?

image

చలికాలంలో వేడివేడిగా తినాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుంటారు. పదే పదే ఆహారాన్ని వేడి చేస్తే పోషకాలు తగ్గడంతోపాటు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి.

News November 12, 2025

క్రికెట్ న్యూస్ రౌండప్

image

⭒ AFG-U19 జట్టుతో జరిగే సిరీస్ కోసం భారత U-19 క్రికెట్ టీమ్‌కు ఎంపికైన HYD పేసర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్
⭒ రేపు రాజ్‌కోట్ వేదికగా మ.1.30 నుంచి IND-A, SA-A మధ్య తొలి అనధికార ODI
⭒ టెస్ట్ టీమ్ నుంచి నితీశ్ రెడ్డిని రిలీజ్ చేసిన BCCI.. SA-A వన్డే సిరీస్‌లో ఆడనున్న నితీశ్.. రెండో టెస్ట్ నాటికి తిరిగి జట్టులో చేరిక
⭒ INDతో టెస్ట్ సిరీసే నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఛాలెంజ్: SA హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్

News November 12, 2025

ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి లోకేశ్

image

AP: ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘గత 16 నెలల్లో $120B పెట్టుబడులు వచ్చాయి. 5 ఏళ్లలో 20L ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. పెట్టుబడిదారులు APని ఎందుకు ఎంచుకోవాలో 3 కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని CII సమ్మిట్‌పై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వివరించారు.