News October 30, 2025

PHOTOS: తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2-5 గంటల వరకు ఈ పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో తెలియక దోషాలు జరిగితే వాటి నివారణకు కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ అని EO అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

Similar News

News November 12, 2025

కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

image

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.

News November 12, 2025

రబీలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు

image

నీటి వసతిని బట్టి రబీలో వేరుశనగను నవంబర్ నుంచి DEC-15 వరకు విత్తుకోవచ్చు. కోస్తా జిల్లాల్లో రైతులు ఎక్కువగా విశిష్ట TCGS 1694 రకాన్ని సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 100-105 రోజులు. దిగుబడి హెక్టారుకు 25 క్వింటాళ్లు. దీనిలో నూనెశాతం 49%. ఇదే కాకుండా కదిరి-6, కదిరి-7, ధీరజ్, ధరణి, గ్రీష్మ, నిత్యహరిత మంచి దిగుబడిస్తాయి. వేరుశనగను ప్రతిసారి ఒకే రకం కాకుండా.. మార్చి నాటితే మంచి దిగుబడి పొందవచ్చు.

News November 12, 2025

MSTCలో 37 ఉద్యోగాలు

image

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (MSTC) 37మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ బీటెక్, డిగ్రీ/PG, CA/CMA, MBA, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mstcindia.co.in/