News November 1, 2025

NLG: అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శనకు నవంబర్‌ 3న నల్గొండ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ కె.జాని రెడ్డి తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులు నడిపిస్తామని, ఈ యాత్రలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని చెప్పారు. వివరాల కోసం 92980 08888 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Similar News

News November 2, 2025

BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.

KMR: TGTA, TGRSA రాష్ట్ర సమావేశానికి జిల్లా ఉద్యోగులు

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల రెవిన్యూ ఉద్యోగులు ఆదివారం యాదగిరిగుట్టలో జరుగుతున్న తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్(TGTA), తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్(TGRSA) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుటకు ఈ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.