News November 1, 2025
ఖమ్మం: ‘కాపలా కాసి చంపేశారు’

సీపీఎం నేత సామినేని రామారావు <<18156229>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. రోజులాగే గ్రామంలో వాకింగ్‌కు వెళ్లి ఉ.6:15కు వచ్చారు. ఇంటి ఆవరణలోని కొట్టంలో కోళ్లు వదులుతుండగా మాటువేసిన దుండగులు కత్తులతో ఛాతి, పొట్టలో 8సార్లు పొడిచారు. కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన కత్తిపౌచ్, ఓ జత చెప్పులు, టీషర్ట్ లభించాయి. విచారణకు సీపీ 5బృందాలు ఏర్పాటు చేశారు.
Similar News
News November 2, 2025
VKB: ‘ప్రజావాణిని పట్టించుకోని అధికారులు!

ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాల, బొంరాస్‌పేట్‌తో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. సక్రమంగా మండలాలు ప్రజావాణి జరిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తి ఉండదని గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు.
News November 2, 2025
కాలీఫ్లవర్‌లో బటనింగ్ తెగులును ఇలా గుర్తించండి

కాలీఫ్లవర్ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News November 2, 2025
నల్గొండ: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు పొడిగింపు

నల్గొండ శివారు రాంనగర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్ లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 వరకు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


