News November 1, 2025

UPDATE: ఘటనా స్థలాన్ని పరిశీలించిన NZB CP

image

నవీపేట్ మండలం ఫకీరాబాద్ -మిట్టాపల్లి రహదారిలో ఓ మహిళను <<18166463>>వివస్త్రగా చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.<<>> విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.

Similar News

News November 2, 2025

నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

image

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్‌పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.

News November 2, 2025

NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

image

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 2, 2025

నిజామాబాద్: అలసత్వ వహిస్తే ఉపేక్షించేది లేదు: బక్కి వెంకటయ్య

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగుల ప్రమోషన్‌లలో రిజర్వేషన్ అమలుపై కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. భవానిపేట, గొరెగామ్‌లలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.