News November 1, 2025
HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపుల కలకలం

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్‌ను ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్‌ను పరిశీలిస్తున్నాయి.
Similar News
News November 2, 2025
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News November 2, 2025
తిరుపతి జూలో వరుస మరణాలు

తిరుపతి జూలో జంతువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పులులు, చిరుతలు, <<18162099>>వాలబీ <<>>వంటి అరుదైన జంతువులు చనిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చినవి అనారోగ్యం, వృద్ధాప్యంతో చనిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. జూ అధికారులు మరింత జాగ్రత్తగా జంతువులు అనారోగ్యానికి గురికాకుండా కాపాడాలని కోరుతున్నారు.
News November 2, 2025
మద్యం దుకాణాల కోసం ‘బేరసారాలు షురూ..

మద్యం టెండర్లలో దుకాణాలు దక్కని వ్యాపారులు మనోవేదనకు గురవుతూ.. డ్రాలో మద్యం దుకాణాలు గెలిచినవారితో బేరసారాలు మొదలుపెట్టారు. ఆసిఫాబాద్ జిల్లాలో 25 దుకాణాలకు డ్రా జరగగా, షాపులు రానివారు ‘ఎంతైనా ఇస్తాం’ అంటూ ఆశ చూపించి దుకాణాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విజేతలతో ఎంతమంది భాగస్వాములున్నారు.. గుడ్విల్ కింద ఇచ్చే అవకాశం ఉందా…? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


