News November 1, 2025

అయ్యప్ప దీక్ష: స్వామి అనే ఎందుకు పిలుస్తారు?

image

అయ్యప్ప మాలధారణలో ‘నేను’ అనే భావం ఉండదు. పేర్లు, వస్త్రాలు, దినచర్య.. వీటన్నింటినీ వదిలి దైవారాధనలో భాగమవుతారు. దీక్ష స్వీకరించాక తన వ్యక్తిత్వాన్ని విడిచి, అంతర్లీనంగా దైవ స్వరూపంగా మారతారు. జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో.. ఆ వ్యక్తిని ప్రత్యేకించి కాక, పరమాత్మ అంశగా చూస్తారు. అందుకే అయ్యప్ప ప్రతిరూపంగా వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. ఇది ప్రతి భక్తుడిని భగవంతునిగా గౌరవించే గొప్ప ఆచారం.

Similar News

News November 2, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా వీస్తున్న గాలులకు రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఇవాళ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA తెలిపింది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. TGలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు HYD IMD పేర్కొంది.

News November 2, 2025

కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

image

భారీ వర్షాలు కెన్యాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. రిఫ్ట్ వ్యాలీలో కొండచరియలు విరిగిపడి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వెస్ట్రన్ కెన్యాలో వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు ధ్వంసమై పలువురు నిరాశ్రయులు అయ్యారు.

News November 2, 2025

చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

image

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.