News November 1, 2025

NZB: సలహా యోగమేనా.. మంత్రి యోగం లేదా..?

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మూడు ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కినా, మంత్రి పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే షబ్బీర్ అలీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. తాజాగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కూడా ప్రభుత్వ సలహాదారుగా పదవి లభించింది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి యోగం దక్కుతుందేమోనని ఆశలు పెట్టుకున్నారు.

Similar News

News November 2, 2025

నూజివీడులో నేటి మాంసం ధరలు ఇలా

image

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, చికెన్ రూ.200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలు, ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చేపలు కిలో రూ.200 నుంచి 380 రూపాయలు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలుగా విక్రయిస్తున్నారు.

News November 2, 2025

HYD: KCR తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు: కిషన్ రెడ్డి

image

‘బంగారు తెలంగాణ’ పేరిట KCR తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 83 కోట్ల మందికి ఉచిత బియ్యం, ఉజ్వల పథకం, మహిళలకు రుణాలు అందిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలిందన్నారు.