News November 1, 2025
ఎన్టీఆర్: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ 1,2,4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు https://anucde.info/ResultsJAug25.asp చూడాలని వర్సిటీ తెలిపింది.
Similar News
News November 2, 2025
సిద్దిపేట: వైన్స్ షాపుల అనధికారిక వేలం!

రెండు రోజుల క్రితం మద్యం దుకాణాల టెండర్లు పూర్తయ్యాయి. దుకాణాలు పొందిన వారికి అదృష్టం వరించిందని అందరు అనుకున్నారు. నిజమే వారికి అదృష్టం వరించింది. అధికారిక టెండర్లు పూర్తవ్వగానే ఇప్పడు అనధికారంగా వేలం పాటలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారు ఆ దుకాణాలను కోట్లలో విక్రయించడానికి తెర తీశారని అంటున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూద్దాం.
News November 2, 2025
అమరావతి మార్క్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక

నవంబర్ 26న రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించనున్న మార్క్ అసెంబ్లీకి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పోటీల్లో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారని MEOలు త్యాగరాజు, నాగ సుబ్రాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ తెలిపారు. PTM మండలం, రంగసముద్రం ZP స్కూల్ విద్యార్థి పవన్ సాయి, తంబళ్లపల్లె మోడల్ స్కూల్ విద్యార్థిని సుహాన, బి కొత్తకోట ZP విద్యార్థి అనిల్ కుమార్ ఎంపికయ్యారన్నారు.
News November 2, 2025
ప్రొద్దుటూరు: అక్టోబర్‌లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.


