News November 1, 2025

మొంథా తుఫాను సేవలు: శ్రీశైలం ఎమ్మెల్యేకు సీఎం అవార్డు

image

శ్రీశైలం నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు శనివారం ఉండవల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డాకు ముఖ్యమంత్రి అవార్డును బహూకరించారు. వరద విపత్తులో తన కృషిని గుర్తించడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News November 2, 2025

కొమరాడ: నాటుసారాతో మూడు బైకులు స్వాధీనం

image

కొమరాడ మండలం గుమడ గ్రామం వద్ద తనిఖీలు చేపడుతుండగా నాటుసారా తరిలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని పార్వతీపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ.సంతోష్ ఆదివారం తెలిపారు. ముందుస్తు సమాచారం మేరకు ఎస్సై ఎస్.సింహాద్రి సిబ్బందితో సహా రూట్ వాచ్ చేశారన్నారు. రెండు చోట్ల 560 లీటర్లు నాటుసారా, మూడు బైకులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News November 2, 2025

పేద యువకుడికి అండగా MLA రాజగోపాల్ రెడ్డి

image

NLG: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చౌటుప్పల్ మండలం చిన్న కొండూరుకు చెందిన నెల్లి గణేష్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాననే మాటను నిలబెట్టుకుంటూ.. తన సొంత ఖర్చు రూ.12.50 లక్షలతో గణేష్‌కు ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. మంచి మనసును చాటుకున్న ఎమ్మెల్యేను పలువురు జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

News November 2, 2025

చాలా రోజుల తర్వాత కనిపించిన కెప్టెన్

image

చాలా కాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదివారం కనిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసి, బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణరావు మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.