News November 1, 2025
HYD: కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి: మంత్రి

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు రహమత్‌నగర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ నగర్ నుంచి ప్రతిభ నగర్ వరకు నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని, నవీన్ యాదవ్‌ని గెలిపించాలని కోరారు.
Similar News
News November 2, 2025
తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 2, 2025
కదిరిలో 30 మందిపై రౌడీ షీట్లు నమోదు

హత్య, హత్యాయత్నం, గంజాయి అమ్మకాలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై కదిరి టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాలతో 30మందిపై రౌడీషీట్లు నమోదు చేసినట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురిపై PD చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు చెప్పారు.
News November 2, 2025
డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్‌స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.


