News November 1, 2025

GWL: విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.!

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్‌ జయరాములును తక్షణమే <<18166938>>సస్పెండ్<<>> చేయాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Similar News

News November 2, 2025

MBNR: అక్టబర్‌లో 21 రెడ్‌హ్యాండెడ్ కేసులు

image

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్‌హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్‌స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

News November 2, 2025

MBNR: రగ్బీ పోటీలు.. రేపే SELECTIONS

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్- 17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌‌లో రేపు అండర్- 17 విభాగంలో బాలబాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తిగల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.

News November 2, 2025

సిద్దిపేట: కొట్టి దోచుకెళ్లాడు.. పోలీసులకు చిక్కాడు

image

సిద్దిపేటలో దోపిడీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాత బస్‌స్టాండ్‌ వద్ద ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను అబ్దుల్ బెదిరించి, కొట్టి, అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ. 1,500 నగదు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.