News November 1, 2025
నిజామాబాద్: భార్యను చంపేసిన భర్త

సంగారెడ్డి(D) పటాన్‌చెరు (M) అమీన్‌పూర్ PS పరిధి వడక్‌పల్లి గ్రామ శివారులో భార్యను భర్త చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన బానోతు రాజు(48), భార్య భానోత్ సరోజ(44) 6 నెలల కిందట బతుకుదెరువు నిమిత్తం అమీన్‌పూర్‌కు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో భార్యను తలపై కట్టెతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది. మృతురాలికి ఇద్దరు సంతానం.
Similar News
News November 2, 2025
పాలమూరు వర్సిటీ.. రేపు ఓరియంటేషన్ ప్రోగ్రాం

పాలమూరు యూనివర్సిటీలోని అకడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో రేపు ‘ఓరియంటేషన్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మాలవి తెలిపారు. LL.B(3ydc) & LL.M 1 బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఉదయం 10:30కు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి(VC) జీఎన్ శ్రీనివాస్ హాజరవుతున్నారన్నారు. విద్యార్థులు తప్పక హాజరుకావాలని ఆమె కోరారు.
News November 2, 2025
మునిపల్లి: తాటిపల్లి వైన్స్‌కు భారీ డిమాండ్.. ఈనెల 3న లక్కీ

మునిపల్లి మండలం తాటిపల్లి వైన్స్‌కు లైసెన్స్ మంజూరు కోసం ఈనెల 3న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర తెలిపారు. ఈ ఒక్క వైన్స్ కోసం ఏకంగా 97 దరఖాస్తులు వచ్చాయని, దీని ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 2.91 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. డ్రాను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య సమక్షంలో తీయనున్నారు.
News November 2, 2025
కృష్ణా: డిగ్రీ ఎగ్జామ్స్ టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3, 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 17- 24 మధ్య ఉదయం 9- 12 గంటల మధ్య , ఈ నెల 17- 28 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2- 5 గంటల మధ్య వర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.


