News November 1, 2025
GNSS కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

GNSS స్పెషల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన నీలమయ్య రిలీవ్ అయ్యాడు. ఆ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌ను అదనంగా స్పెషల్ కలెక్టర్‌గా కేటాయించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్‌లో కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు.
Similar News
News November 2, 2025
వినుకొండ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వినుకొండ పట్టణ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
News November 2, 2025
NOV.4న తిరుపతి జిల్లా కబడ్డీ జట్ల సెలక్షన్ ట్రయల్స్

37వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తిరుపతి జిల్లా బాలురు, బాలికల జట్ల ఎంపిక కోసం ట్రయల్స్ నవంబర్ 4న మధ్యాహ్నం 2 గంటలకు నాగలాపురం పాఠశాల మైదానంలో జరగనున్నాయి. బాలురు 60 కిలోల లోపు, బాలికలు 55 కిలోల లోపు బరువుతో, 2009 డిసెంబర్ 1 లేదా ఆ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని జిల్లా కబడ్డీ సంఘం తెలిపింది.
News November 2, 2025
గద్వాలలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గద్వాల్ పట్టణం శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి అనే మహిళా అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గద్వాల సీఐ శ్రీను, టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బలిజ లక్ష్మి, మల్లికార్జున్ ఇద్దరు భార్యాభర్తలు. భర్త ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా మృతురాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


