News November 1, 2025

పలాసకే తలమానికంగా నిలిచిన గుడి ఇది!

image

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వందలాది దేవతామూర్తుల విగ్రహాలతో <<18168511>>హరిముకుందా పండా అద్భుతంగా నిర్మించారు<<>>. తిరుమల శ్రీవారి విగ్రహంలా 9అడుగుల ఏకశిల విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించి ప్రతిష్ఠ చేశారు. పలాసకే ఈ గుడి తలమానికంగా నిలిచింది. దీంతో భక్తులు భారీగా ఆలయానికి వస్తుంటారు. హరిముకుంద ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆలయంలో ప్రత్యేకతలు ఒడిశా సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి.

Similar News

News November 2, 2025

SKLM: ఒక్కొక్కరికి రూ.17లక్షల పరిహారం

image

కాశీబుగ్గ వేంకన్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే కేంద్రం మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించింది. మొత్తంగా చనిపోయిన కుటుంబానికి రూ.17లక్షలు, గాయపడిన వారికి రూ.3.50లక్షల అందనుంది. మృతుల్లో TDP కార్యకర్తలు ఉండటంతో రూ.5లక్షల చొప్పున ఇన్సురెన్స్ రానుంది.

News November 2, 2025

SKLM: ‘లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి’

image

గార(M) వమరవెల్లి డైట్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 3 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 8 లెక్చరర్ పోస్టులు (డిప్యూటేషన్‌పై) నవంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జడ్పీ, మున్సిపల్ హైస్కూల్స్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్ లీప్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News November 1, 2025

ఇది శవ రాజకీయం తప్ప మరేమీ కాదు: TDP

image

కాశీబుగ్గలోని తమ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సాధారణంగా 2 వేల మంది వస్తుంటారని.. ఇంతమంది వస్తారని ఊహించలేదని నిర్వాహకుడు హరిముకుంద్ పండా అన్నారు. రద్దీ ఇంత ఉంటుందని తెలియక పోలీసులకు చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ స్పందించింది. ‘ఇంత మంది ఎప్పుడూ రాలేదని’ ఆలయ ధర్మకర్తలే అంటుంటే ముందస్తు సమాచారం ఉంది అంటూ శవ రాజకీయం చేసే పార్టీ ఏపీలో ఉండటం దురదృష్టకరమని TDP మండిపడింది.