News November 1, 2025

HYD: కొత్త మంత్రి అజహరుద్దీన్ శాఖలపై ఉత్కంఠ!

image

కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ శాఖల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. అజహరుద్దీన్ మైనారిటీ సంక్షేమం, హోం శాఖలను పొందుతారని ఊహాగానాలు వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం ఒక రోజులోనే కొత్త మంత్రుల శాఖలను ప్రకటిస్తుంది. కాగా రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు తమ ప్రస్తుత శాఖలను కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. మరి ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 2, 2025

‘ఇందిరమ్మ భవనం’గా బీఆర్ఎస్ కార్యాలయం

image

మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పు పెట్టిన విషయం విధితమే. పూర్వ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ గా మార్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం తెలంగాణ భవన్ ను స్వాధీనం చేసుకుని ఇందిరమ్మ భవనంగా నామకరణం చేస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ జండాలు తొలగించి కాంగ్రెస్ జెండాలు ఆవిష్కరించారు.

News November 2, 2025

హైదరాబాద్ NFCలో అప్రెంటిస్ ఖాళీలు

image

HYDలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. నెలకు 10,500 స్ట్రైఫెండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్‌సైట్: https://www .nfc.gov.in/recruitment.html