News November 1, 2025

ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించండి: కలెక్టర్

image

ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలోని ఎల్ఈడీ బల్బులు, లైట్ల తయారీ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. వాయు, నీటి కాలుష్యాలను నివారించాలని, పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాలని నిర్వాహకులకు సూచన చేశారు. తమ యూనిట్‌లో పలు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన బల్బులను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News November 2, 2025

రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది: కేటీఆర్

image

మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల BRS కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్నారు.

News November 2, 2025

సారంగాపూర్: చిన్నారిపై విరుచుకోపడ్డ కుక్కలు

image

సారంగాపూర్ మండలం బీరవెల్లిలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సయ్యద్ సహాద్(1) పై దాడి చేయడంతో బాబు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. నిత్యం కుక్కల దాడులు పెరుగుతున్నాయని వాపోయారు.

News November 2, 2025

క్రీడా సంఘాల వివరాలు ఇవ్వండి: DYSO

image

సిద్దిపేట జిల్లాలోని క్రీడా సంఘాలు తమ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య కోరారు. రానున్న సీఎం కప్‌ను దృష్టిలో ఉంచుకుని, క్రీడా సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలు, కార్యవర్గ సభ్యుల వివరాలను ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా క్రీడా శాఖ కార్యాలయంలో అందజేయాలి. మరింత సమాచారం కోసం 9441925763 నంబర్‌కు సంప్రదించవచ్చని చెప్పారు.