News November 1, 2025
అమలాపురం: జిల్లా డీఐఈఓగా విజయశ్రీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా (డీఐఈఓ) రాజమండ్రి డీఐఈఓ డి.విజయశ్రీ శనివారం ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డీఐఈఓగా పనిచేసిన సోమశేఖర రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఆమె ఫుల్ అడిషనల్ ఛార్జ్ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా డీఐఈఓ విజయశ్రీ పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
IAS అకాడమీల తప్పుడు ప్రచారాలు.. భారీ జరిమానా

UPSCలో అభ్యర్థుల విజయాలను తమ ఘనతగా చెప్పుకున్న ఢిల్లీలోని రెండు IAS కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొరఢా ఝళిపించింది. ఒక్కో సంస్థకు ₹8L చొప్పున ఫైన్ విధించింది. తాను కేవలం ఒక్క ఇంటర్వ్యూకు హాజరైతే క్రెడిట్‌ను దీక్షంత్ సంస్థ తమ ఖాతాలో వేసుకుందని 2021లో సివిల్స్ విజేత మణిశుక్లా ఫిర్యాదు చేశారు. అలాగే తన అనుమతి లేకుండా ఫొటో వాడిందంటూ అభిమను అకాడమీపై నటాష ఫిర్యాదు చేశారు.
News November 2, 2025
వారికి రూ.10,000 బహుమతి: ఎమ్మెల్యే ఉగ్ర

జాతీయ రహదారి భద్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. హైవే రోడ్డుపై ఇళ్ల నిర్మాణాల నుంచి వచ్చిన శిథిలాలు, మట్టి, వ్యర్థాలను రహదారి పక్కన వేస్తున్న వారి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన శిధిలాలు వేసిన వారి వివరాలు లేదా ఫొటోలు, వీడియో సాక్ష్యాలు అందించిన వారికి రూ.10,000 బహుమతి అందజేస్తామని తెలిపారు.
News November 2, 2025
మణుగూరులో 144 సెక్షన్ అమలు

మణుగూరు తెలంగాణ భవన్‌పై దాడి జరిగిన ఘటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్నందున 144 సెక్షన్ విధిస్తున్నట్లు MRO అద్దంకి దయాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉన్నందున 144 సెక్షన్ (BNSS 163) అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మణుగూరు సుందరయ్య నగర్లో పటిష్టంగా అమలవుతుందని చెప్పారు. ఎవరైనాా 144 సెక్షన్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సూచించారు.


