News November 1, 2025

ధర్మవరం హాస్టల్‌ ఇన్‌ఛార్జ్‌గా అలంపూర్ వార్డెన్

image

ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన కారణంగా వార్డెన్ జయరాములును విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, ఆ హాస్టల్‌కు అలంపూర్ బీసీ హాస్టల్ వార్డెన్ డి.శేఖర్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ శనివారం ప్రకటించారు. జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు హాస్టళ్లపై పర్యవేక్షణ చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News November 2, 2025

ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

image

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.

News November 2, 2025

సంగారెడ్డి: ’15న ప్రత్యేక లోక్ అదాలత్’

image

ప్రత్యేక లోక్ అదాలత్ ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం సమావేశం నిర్వహించారు. రాజీ కేసులను ప్రత్యేక లోక్అదాలత్లో పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చిన్నపాటి వివాదాలు, మోటార్ యాక్సిడెంట్ కేసులు ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.

News November 2, 2025

నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

image

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.