News November 1, 2025

సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలోని పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Similar News

News November 2, 2025

సాగులో వేప వినియోగం – ఫలితాలు అద్భుతం

image

వ్యవసాయంలో చీడపీడల నివారణలో క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణకు వేప పిండి ఉపయోగపడుతోంది.

News November 2, 2025

డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. హార్టికల్చర్, ఎంటమాలజీ, ఎక్స్‌టెన్షన్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. PhD, BSc(హానర్స్) హార్టికల్చర్ లేదా BVSc, MSc(అగ్రి./MVSc), MSc/MA, BA/BSc ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://drysrhu.ap.gov.in/

News November 2, 2025

నేడు పాల సముద్రాన్ని చిలికిన రోజు

image

కార్తీకమంతా పండుగే. అందులో శుక్లపక్ష ద్వాదశిని ‘క్షీరాబ్ది ద్వాదశి’గా జరుపుకొంటారు. ఇది దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికిన రోజుగా చెబుతారు. విష్ణువు యోగ నిద్రలో నుంచి లేచి, ఆ మరుసటి రోజున లక్ష్మీదేవితో బృందావనానికి వచ్చి, తులసి మాతను దామోదరుడి రూపంలో వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నేడు తులసి పూజలు చేస్తే.. ఆ దేవతల అనుగ్రహం లభిస్తుందని, లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటారు.