News November 1, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోనీ ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఆ వివరాలను మండల విద్యాధికారుల ద్వారా జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.
Similar News
News November 2, 2025
సిరిసిల్ల: రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళు

పత్తి పంటను సోమవారం నుండి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమైంది. వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలలో సుమారు మూడు లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల లోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 2, 2025
కామారెడ్డిలో రేపు ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
News November 2, 2025
సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.


