News November 1, 2025

ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను వినియోగించాలి: JC

image

అన్నమయ్య జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌ను అధికారులందరూ వినియోగించాలని JC ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తదితర శాఖల జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా సుపరిపాలనపై రూపొందించబడిన ANM విస్తా మొబైల్ అప్లికేషన్‌పై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News November 2, 2025

కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 2, 2025

సిరిసిల్ల: రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళు

image

పత్తి పంటను సోమవారం నుండి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమైంది. వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలలో సుమారు మూడు లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల లోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News November 2, 2025

కామారెడ్డిలో రేపు ప్రజావాణి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.