News November 1, 2025

‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ అంటే..

image

ఇదొక దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో మెదడు, పేగులు కలిసి పనిచేయవు. దీనివల్ల పేగుల్లో సున్నితత్వం పెరుగుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం, మల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, ఫ్యాట్, ప్రాసెస్డ్, కారంగా ఉండే ఫుడ్స్‌కు దూరంగా ఉంటే ఈ సమస్యను అదుపుచేయవచ్చు.

Similar News

News November 2, 2025

అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

image

పుష్ప సినిమాలో నటనకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

News November 2, 2025

BREAKING: సుందర్ విధ్వంసం.. భారత్ విజయం

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూర్య సేన 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో సుందర్ (23 బంతుల్లో 49*), జితేశ్ శర్మ (13 బంతుల్లో 22*) మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.

News November 2, 2025

తొలి ‘గే’ ప్రధానిగా రాబ్ జెట్టెన్!

image

నెదర్లాండ్స్‌ ఎన్నికల్లో D66 సెంట్రిస్ట్ పార్టీ ఇటీవల ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్, 38ఏళ్ల రాబ్ జెట్టెన్ ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఆ దేశ పిన్న వయస్కుడు, తాను ‘గే’ అని బహిరంగంగా చెప్పుకున్న రాబ్ PMగా నిలిచి రికార్డులకెక్కనున్నారు. ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని, గొప్ప బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. కాగా అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్‌తో జెట్టెన్ ఎంగేజ్‌మెంట్ 3ఏళ్ల కిందటే జరిగింది.