News November 1, 2025

వనపర్తి: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News November 2, 2025

వరంగల్: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టాల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.

News November 2, 2025

కార్తీక పౌర్ణమి ఏరోజు జరపాలంటే?

image

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి NOV 5న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానాలకు 4:52 AM – 5:44 AM అనుకూలంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను 7:58 AM – 9:00 AM జరపాలని సూచించారు. దీపారాధనకు సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు ఉత్తమమన్నారు. పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం పెట్టి, శివకేశవులను పూజించి, ఉపవాసం ఉంటే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.☞ కార్తీక పౌర్ణమి విశేషాలు, పూజ నియమాల కోసం <<-se_10013>>భక్తి<<>>.

News November 2, 2025

అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

image

పుష్ప సినిమాలో నటనకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.