News November 1, 2025
రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలి: ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేశ్ బాబు డిమాండ్ చేశారు. లేకపోతే ఎల్లుండి నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిరవధిక బంద్ చేస్తాయని హెచ్చరించారు. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యాజమాన్యాలను కోరుతున్నామన్నారు. కాలేజీలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News November 2, 2025
తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.
News November 2, 2025
సచిన్‌తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

ICC ఛైర్మన్ జైషాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. తన భార్య బ్రాహ్మణితో పాటు వెళ్లి జైషా, ఆయన తల్లి సోనాలీ షాను కలిసినట్లు ట్వీట్ చేశారు. క్రికెట్, యువత భాగస్వామ్యం, దేశ క్రీడా భవిష్యత్తు గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్, బ్రాహ్మణి వెళ్లారు. టీమ్ఇండియా జెర్సీలు ధరించిన వారిద్దరూ సచిన్‌తో పాటు పలువురిని కలిశారు.
News November 2, 2025
FINAL: టీమ్ ఇండియాకు శుభారంభం

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి 58 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యారు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో షెఫాలీ (58*), జెమీమా రోడ్రిగ్స్ (9*) క్రీజులో ఉన్నారు.


