News November 2, 2025

HYDకు మెస్సీ.. వారంలో బుకింగ్స్

image

ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. కేరళ ప్రోగ్రామ్ రద్దవడంతో HYDను చేర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి/రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదిక ఉంటుందని, వారంలో బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. GOAT Cupలో భాగంగా డిసెంబర్ 12/13 తేదీల్లో మెస్సీ కోల్‌కతా చేరుకుంటారు. అదే రోజు HYD, 14న ముంబై, 15న ఢిల్లీలో సెలెబ్రిటీలతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతారు.

Similar News

News November 2, 2025

జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

image

AP: నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘జోగి రమేశ్ ప్రోద్బలంతోనే మద్యం తయారు చేశాం. వ్యాపారంలో నష్టపోయిన నాకు రూ.3కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టారు. ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారు’ అని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

News November 2, 2025

అగ్‌హబ్ ఫౌండేషన్‌లో ఉద్యోగాలు

image

HYDలోని అగ్‌హబ్ ఫౌండేషన్ రూరల్ కోఆర్డినేటర్(2), కమ్యూనికేషన్ మేనేజర్(1) పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ(మార్కెటింగ్, జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్), డిగ్రీ( అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు) ఉత్తీర్ణులు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు NOV 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://pjtau.edu.in/

News November 2, 2025

తుంబురుడికి జ్ఞానప్రబోధం జరిగిన తీర్థం

image

తన గానంతో దేవలోకాన్ని మంత్రముగ్ధం చేసిన తుంబురుడు ఓనాడు ‘నాకన్నా ఉత్తమ గాయకుడు లేడు’ అనే గర్వంతో విర్రవీగిపోయాడు. అప్పుడు బ్రహ్మ ఆయనను భూమిపై మానవ రూపంలో జన్మిస్తావని శపించాడు. మానవ రూపంలో పుట్టిన తుంబురుడు ఘోర తపస్సు చేయగా నారదుడు ప్రత్యక్షమయ్యాడు. వీణానాదంతో తుంబురుడికి జ్ఞానప్రబోధం చేశాడు. ఆ ప్రదేశమే ‘తుంబురు తీర్థం’. ఇది తిరుమల కొండల్లో, బాలాజీ టెంపుల్‌కు 16KM దూరంలో ఉంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>