News November 2, 2025
కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.
Similar News
News November 2, 2025
అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.
News November 2, 2025
పోలీస్ క్రికెట్ పోటీల్లో విజేతగా ఎస్పీ టీం

వాల్మీకిపురం వీసీసీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ జట్టు విజేతగా నిలిచింది. ఎస్పీ ధీరజ్ కెప్టెన్‌గా రాయచోటి ఏఆర్ పోలీస్ జట్టు, డీఎస్పీ మహేంద్ర కెప్టెన్‌గా మదనపల్ల,ె పోలీసు జట్టు తలపడ్డాయి. తొలిత బ్యాటింగ్ చేసిన ఎస్పీ జట్టు 10 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో 173 పరుగులు చేసింది. డీఎస్పీ జట్టు 155 పరుగులు మాత్రమే చేసింది.
News November 2, 2025
‘కాశీబుగ్గ’ తొక్కిసలాట అప్డేట్స్

* మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
* కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా త్వరలో అందుతుందని రామ్మోహన్ చెప్పారు.
* పలాస ఆస్పత్రి నుంచి 15 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందికి సీహెచ్‌సీతో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాం: మంత్రి సత్యకుమార్ యాదవ్


