News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
Similar News
News November 2, 2025
అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.
News November 2, 2025
‘కాశీబుగ్గ’ తొక్కిసలాట అప్డేట్స్

* మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
* కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా త్వరలో అందుతుందని రామ్మోహన్ చెప్పారు.
* పలాస ఆస్పత్రి నుంచి 15 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందికి సీహెచ్‌సీతో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాం: మంత్రి సత్యకుమార్ యాదవ్
News November 2, 2025
20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

TG: ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. BRS పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే… మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లో మంత్రి ప్రచారం నిర్వహించారు.


