News November 2, 2025

కామారెడ్డి: మదన్ మోహన్‌కు లోకల్ బాడీ అదనపు కలెక్టర్ బాధ్యతలు

image

కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్‌‌ను ఇన్‌ఛార్జి లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్‌‌గా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ నియమించారు. శనివారం మదన్ మోహన్‌ బాధ్యతలు స్వీకరించి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Similar News

News November 2, 2025

భద్రాద్రి: మా రహదారి కష్టాలు తీర్చే నాధుడే లేరా?

image

చర్ల మండలం తిప్పాపురం నుంచి బత్తిన పెళ్లికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు కూడా గ్రామానికి రావడం మానేశారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

News November 2, 2025

వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

image

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది.

News November 2, 2025

VJA: జోగి రమేశ్ విచారణ పూర్తి.. కుమారుడికి నోటీసులు జారీ

image

నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ సిట్ విచారణ పూర్తి అయ్యింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. కాసేపట్లో ప్రభుత్వాస్పత్రికి జోగి రమేశ్ తరలించారు. జోగి రమేశ్ చిన్న కుమారుడు జోగి రోహిత్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని రోహిత్‌కు సిట్ నోటీసులు జారీ చేశారు.