News November 2, 2025
మంచిర్యాల: రూ.1.39 కోట్లు కాజేసిన నిందితుడి అరెస్టు

తప్పుడు లెక్కలతో వరి ధాన్యాన్ని చూపించి సివిల్ సప్లై నిధులు రూ.1.39 కోట్లు కాజేసిన కేసులో 3వ నిందితుడు సాయికుమార్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ చెప్పారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలు 12 మంది పరారీలో ఉన్నారన్నారు. వారిని పట్టుకోవడం కోసం ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
గంగవరం బీచ్‌లో యువకుడు గల్లంతు

గంగవరం సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్ద యువకుడు కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు. ఒడిశాకు చెందిన నలుగురు యువకులు, గంగవరం సమీపంలో బీచ్‌కు సందర్శనకు వెళ్ళగా మాధవస్వామి టెంపుల్ వద్ద రాళ్లపై నిలబడి రూపక్ సాయి అనే యువకుడు ఉండగా కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుడు పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 3, 2025
4న ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో ఈనెల 4న ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్స్ ఖోఖో జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఎంపికైన ఉమ్మడి జిల్లా మహిళ, పురుషుల జట్లు 7న పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు. వివరాలకు 99637 70406, 95538 10943 సంప్రదించాలన్నారు.
News November 3, 2025
KMR: రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి: MLC

రేపటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బందుకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆదివారం
హైదారాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే రూ.900 కోట్లు, పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ ప్రైవేటు విద్యాసంస్థలను మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని దుయ్యబట్టారు.


