News November 12, 2025
HYD: ఈ టైమ్‌లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News November 12, 2025
జూబ్లీ బైపోల్.. ఫలితాలపై ఎవరి ధీమా వారిదే!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 48.49 శాతం పోలింగ్ నమోదు కాగా ఫలితాల్లో తమదే విజయమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు చెబుతున్నారు. పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరిగిందని, తామే గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సైలెంట్ ఓటింగ్‌తో తమదే గెలుపు అని BRS ధీమాగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అనంతరం కమలనాథులు సందిగ్ధంలో ఉన్నారు. గెలుపెవరిదో..?
News November 12, 2025
WOW.. HYDలో ఇప్పపువ్వు లడ్డూలు

HYDలో నాంపల్లి, శేర్లింగంపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఇప్ప పువ్వు లడ్డూలు కనపడుతున్నాయి. ఆదిలాబాద్ ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళలు స్థానిక వ్యాపార రంగంలో కొత్త ఉరవడికి నాంది పలికారు. ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూ రక్తహీనత తగ్గించే, వ్యాధి నిరోధకశక్తినిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు HYDలో భీమాబాయి మహిళా సహకార సంఘం ఈ ఉత్పత్తుల ద్వారా ఏడాదికి రూ.1.27 కోట్ల ఆదాయం పొందుతోంది.
News November 12, 2025
ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.


