News November 12, 2025

HYD: ఈ టైమ్‌లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

image

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News November 12, 2025

హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.

News November 12, 2025

పెట్టుబడుల సదస్సుకు సిద్ధం.. నేటి రాత్రికే విశాఖకు సీఎం

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో CM చంద్రబాబు ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు. రేపు సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి వారికి డిన్నర్ ఇస్తారు. సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

News November 12, 2025

టెన్త్ పరీక్ష ఫీజు 25లోగా చెల్లించాలి: DEO బ్రహ్మాజీరావు

image

పాడేరు: పదవ తరగతి పరీక్షలు రాసేవారు ఈ నెల 13వ తేదీ నుంచి 25 లోగా ఫీజు చెల్లించాలని అల్లూరి DEO బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3తేదీ లోగా రూ. 50 అపరాధ రుసుముతోనూ, డిసెంబర్ 10 తేదీ వరకు రూ.200, డిసెంబర్ 15 తేదీ వరకు రూ.500 రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులు పాఠశాల HMను సంప్రదించాలని కోరారు.