News November 12, 2025
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.73,18,504

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామి వారికి 76 రోజుల్లో రూ.73,18,504 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేష్ తెలిపారు. 80 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి, 21 విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 64

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని గురువైన పరశురాముడు ఎలా గుర్తించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 12, 2025
టుడే..

* AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ
* కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
* TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ, రేపు <<18194401>>స్పీకర్<<>> విచారణ
* మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి
* వేములవాడ ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత
News November 12, 2025
హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.


